Saturday, November 23, 2024

ACA | దేశానికి అత్యుత్తమ క్రీడాకారులను అందిస్తాం : కేసినేని శివనాథ్

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయస్థాయిలో వారిని అత్యుత్తమ స్థాయిలో నిలిపేందుకు ఎసీఏ కృషి చేస్తుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాద్ (చిన్ని) పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే క్రీడాకారులను ప్రోత్సహించి వారికి క్షేత్ర స్థాయిలో అత్యుత్తమ అంతర్జాతీయ శిక్షణ ఇప్పించడంతో పాటు వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం తమ ముందున్న ప్రథమ కర్తవ్యం అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన అన్ని ప్రాంతాలలో స్టేడియం లో నిర్మించడంతోపాటు, మరికొన్ని ప్రాంతాలలో అకాడమీలో ఏర్పాటు కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు. దేశంలోనే ఏసీఏను అగ్రగామిగా నిలపడంతో పాటు, అంతర్జాతీయ క్రీడాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

క్రీడాకారుల ఎంపికలో ఇటువంటి జోక్యం ఉండబోదు అని, మునుపటికి భిన్నంగా ఏసీఏ పనితీరులో పూర్తిస్థాయిలో మార్పు వస్తుందంటున్న కేసినేని శివనాతో ఆంధ్రప్రభ ప్రత్యేక ముఖాముఖి. గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏసీఏను కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన రాజకీయాలతో బ్రష్టు పట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతో నమ్మకంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడా సంఘాలు, పలు అసోసియేషన్లు తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. క్షేత్రస్థాయి నుండి క్రీడాకారులను తయారు చేసేందుకు పాఠశాలా స్థాయి లో అవసరమైన క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. అత్యుత్తమ శిక్షణతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయునున్నట్లు ఆయన చెప్పారు.

క్రీడాకారులు నైపుణ్యాభివృద్ధి కోసం అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పలు పోటీలను నిర్వహించేందుకు అవసరమైన స్టేడియంలు రాష్ట్రంలో ఉన్నట్లు చెప్పిన ఆయన, ప్రస్తుతం మంగళగిరి, విశాఖపట్నం, కడప స్టేడియాలను ఆధునిక స్థాయిలో నిర్మించినట్లు తెలిపారు. వీటితోపాటు రాష్ట్రంలోని తిరుపతి, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాలలో కూడా స్టేడియాలను నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.

- Advertisement -

ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో క్రీడాకారుల నైపుణ్యాన్ని మరింత పెంపొందించే క్రమంలో వారికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీలను ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు వారిని అత్యుత్తమ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే విధంగా టీర్చిదిద్దే కార్యక్రమానికి తాను కంకణ భద్రునిడ్డై ఉన్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆయన క్రీడాకారులతో పాటు సంఘాలు, క్రీడా సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement