న్యూఢిల్లి: టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. మరో 10రోజుల్లో ఉత్తరాఖండ్ జట్టు విజయ్ హజారే ట్రోఫీలో పాల్గోనుంది. ఈ నేపథ్యంలో జాఫర్ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం కూడా పూర్తవకుండా రాజీనామా చేయడం చర్చ నీ యాంశంగా మారింది. అర్హత లేని ఆటగాళ్లను ఎంపికచే యాలంటూ కొందరు జోక్యం చేసుకున్నారని వసీం జాఫర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ క్రికెట్ కార్యదర్శి మహీమ్‌వర్మ కోచ్ జాఫర్ వాదనను తిరస్కరిం చారు. కాగా 2వేల సంవత్సరంలో భారతజట్టులోకి అరంగే ట్రంచేసిన జాఫర్ 2008లో చివరిటెస్టు ఆడాడు. భారత్ తర ఫున జాఫర్ 31టెస్టులు, 2వన్డేలకు ప్రాతినిధ్యం వహిం చాడు. అయితే రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడి 12వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా జఫర్ రికార్డు నమోదు చేశాడు. రంజీటోర్నీలో 150మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్ జాఫర్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 260మ్యాచ్‌లు ఆడి 19,410 పరుగులు చేశాడు. వీటిలో 57 సెంచరీలు, 91 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి.
రిటైర్మెంట్ అనంతరం జాఫర్ గతేడాది ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. కాగా జాఫర్ రాజీనామాను ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అంగీకరించింది.
కోచ్ పదవికి జాఫర్ రాజీనామా
Advertisement
తాజా వార్తలు
Advertisement