Tuesday, November 19, 2024

వేరొక గ్రహం నుంచి వచ్చాడేమో.. సూర్యకుమార్‌పై వసీం అక్రమ్‌ ప్రశంసలు

ప్రపంచకప్‌లో నిలకడగా రాణిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ జాబితాలో పాకిస్తాన్‌ మాజీ దిగ్గజం వసీం అక్రమ్‌ చేరారు. చూస్తుంటే అతడు వేరే గ్రహం నుంచి వచ్చినట్లున్నాడు. అతడి ఆట ఓ ట్రీట్‌లా ఉంటుంది అని కొనియాడారు. బహుశా అతను మరొక గ్రహం నుంచి వచ్చాడనిపిస్తోంది. అందరు ఆటగాళ్ల కంటే పూర్తి భిన్నంగా ఉన్నాడు. ఈ ఏడాది టీ20ల్లో 1000 పరుగుల మైలురాయిని దాటేసిన ఏకైక బ్యాటర్‌ అతను. జింబాబ్వేతోనే కాదు ప్రపంచ మేటి జట్లతోనూ అతని ఆట కనువిందుగా ఉంటుంది. టాలెంట్‌తోపాటు ఏమాత్రం బెరుకులేని ప్లేయర్‌ అతడు. బంతి శరీరానికి తగులుతుందన్న భయమే లేదు.

అలాంటి కుర్రాడి ఆట చూడటం భలే మజాగా ఉంటుంది అని ఓ క్రీడా చానల్‌ చర్చాగోష్టిలో వసీం పొగడ్తలు కురిపించాడు. ఇదే చర్చలో పాల్గొన్న పాక్‌ మాజీ బౌలర్‌ వకార్‌ కూడా స్కైెని ఆకాశానికెత్తేశాడు. ఇలాగైతే ఓ బౌలర్‌ సూర్యకు ఎలా బౌలింగ్‌ చేయాలి? అంటూ చమత్కరించారు. భారత దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ కూడా మిస్టర్‌ 360ఇన్నింగ్స్‌ను కొనియాడారు. సూర్య విఫలమైతే టీమిండియా మంచి స్కోరు చేయడానికి కష్టపడుతుందని అన్నారు. ముఖ్యంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌ను ఇతర బ్యాటర్లకు స్ఫూర్తిగా పేర్కొన్నారు. గత నాలుగు మ్యాచుల్లో సూర్య మూడు హాఫ్‌ సెంచరీలు చేశాడు. వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో 225 రన్స్‌ చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన మూడవ బ్యాటర్‌ అతను. ఇక అతని స్ట్రయిక్‌ రేటు 193.96గా ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement