Tuesday, November 26, 2024

IPL | ఉతికి ఆరేసిన లక్నో.. చేతులెత్తేసిన పంజాబ్​!

ఐపీఎల్​లో ఈ సీజన్​లో ఇప్పటి వరకు ఏ టీమ్​ కొట్టని స్కోరు ఇవ్వాల నమోదైంది. పంజాబ్ గ‌డ్డపై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బ్యాట‌ర్లు ఈ ఘనత సాధించారు. ఫోర్లు, సిక్స్ ల‌తో మొహాలీ స్టేడియాన్నిహోరెత్తించారు. దీంతో ల‌క్నో ఐదు వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగులు చేసింది. ఈసీజ‌న్‌లో అత్యధిక ప‌రుగులు కొట్టిన జ‌ట్టుగా రికార్డు సృష్టించింది. ఇందులో స్టోయినిస్(72), ఓపెన‌ర్ కైల్ మేయ‌ర్స్(54), నికోల‌స్ పూర‌న్(21) పంజాబ్ బౌల‌ర్లను ఉతికి ఆరేశారు. ఆయుష్ బ‌దొని(43), మెరుపు బ్యాటింగ్ చేయ‌డంతో ల‌క్నో భారీ స్కోర్ చేయగలిగింది.

ఇక.. టార్గెట్​ చేజింగ్​లో బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ కింగ్స్​ జట్టు ఆది నుంచి తడబటుకు గురయ్యింది. ఈ జట్టులో అథర్వ (66) మినహా మిగతా వారంతా పెద్దగా ఆడలేకపోయారు. ప్రభుసిమ్రాన్​ (9), శిఖర్​ ధవన్​ (1), సికిందర్​ రజా (36), లివింగ్​స్టోన్​ (23), శామ్​ కరన్​ (21), జితేశ్​ శర్మ (24), రాహుల్​ చాహర్​ (0), రబడా (0) మాత్రమే పరుగులు చేయగలిగారు.. నిర్ణీత ఓవర్లలో కేవలం 201 పరుగులు చేయగలిగారు. దీంతో లక్నో 56 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక.. తొలిసారి బ్యాటింగ్​లో అర్ష్ దీప్ సింగ్ వేసిన 20వ‌ ఓవ‌ర్లో దీప‌క్ హుడా(11) ఫోర్ కొట్టాడు. నాలుగో బంతికి షాట్ ఆడ‌బోయి నికోల‌స్ పూర‌న్(45) ఎల్బీగా ఔట‌య్యాడు. కృనాల్ పాండ్యా(5) బౌండ‌రీ బాదాడు. దాంతో, ల‌క్నో ఐదు వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగులు చేసింది. ల‌క్నోను ఆదిలోనే ర‌బాడ దెబ్బకొట్టాడు. ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్(12) ఆ త‌ర్వాత కైల్ మేయ‌ర్స్(54)ను ఔట్ చేశాడు. మేయ‌ర్స్ 20 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో అత‌ను హాఫ్ సెంచ‌రీ సాధించాడు.

- Advertisement -

ఆ త‌ర్వాత వ‌చ్చిన స్టోయినిస్(72), ఆయుష్ బ‌దొని(43) బాద‌డంతో ల‌క్నో స్కోర్ 8 ఓవ‌ర్ల‌కే వంద దాటింది. ఆఖ‌ర్లో నికోల‌స్ పూర‌న్(12) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడ‌డంతో భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో ర‌బాడ రెండు వికెట్లు తీశాడు. సామ్ క‌ర‌న్, లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ సింగ్ త‌లా ఒక వికెట్‌ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement