Friday, November 22, 2024

David Warner | టెస్టుల్లో ముగిసిన వార్నర్ శకం.. కన్నీటితో పెవిలియన్‌కు

తన దూకుడైన ఆటతీరుతో క్రికెట్ ప్రేమికులను అలరించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్ట్‌తో వార్నర్ తన 13 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం సాధించి జట్టును గెలిపించాడు. చివరి టెస్ట్‌ సిరీస్ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన వార్నర్.. చివరి మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్‌ చేసింది. చివరి టెస్ట్‌ మ్యాచ్ అనంతరం వార్నర్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు.

మొత్తం టెస్ట్ కెరీర్‌లో 111 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 44.5 సగటుతో 8695 పరుగులు చేశాడు. అందులో 3 డబుల్ సెంచరీలు, 26 శతకాలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. పాకిస్తాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన వార్నర్ ఎల్బీగా అవుటై పెవిలియన్ చేరుతున్న సమయంలో స్టేడియంలోని అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

కాగా, పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది. విజయంతో తన కెరీర్ ముగిసినందుకు గర్వంగా ఉందని.. కెరీర్‌లో చివరి టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం అద్భుతంగా ఉందని ఈ స్టార్‌ ఓపెనర్‌ అన్నాడు. కొంత మంది గొప్ప క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా తరఫున ఆడే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాని తెలిపాడు. క్లిష్ట సందర్భాల్లోనూ తనకు అండగా నిలిచిన భార్యకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువేనని భావోద్వేగానికి గురయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement