Friday, November 22, 2024

MI vs DC | ఢిల్లీని ఆదుకున్న వార్నర్, అక్షర్..

ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌటైంది. అక్షర్ పటేల్ 25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు తో ముంబై ఇండియన్స్ బౌలర్లను భయపెట్టేలా ఆడాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 47 బంతుల్లో 51; 6 ఫోర్లు తో మరోసారి నెమ్మదిగా ఆడాడు.

అక్షర్ పటేల్ అవుటయ్యాక.. 19వ ఓవర్లో వార్నర్ తో పాటు మరో మూడు వికెట్లను ఢిల్లీ కోల్పోయింది. 20 ఓవర్లో 10వ వికెట్ ను కోల్పోవడంతో 190 స్కోరు చేస్తున్నట్లు కనిపించిన ఢిల్లీ 172 పరుగులకే పరిమితం అయ్యింది. పీయూశ్ చావ్లా నాలుగు ఓవర్లు వేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లను తీశాడు. జేసన్ బెహ్రన్ డార్ఫ్ కు కూడా 3 వికెట్లు దక్కాయి.

స్కోరుబోర్డు:

- Advertisement -

ఢిల్లి క్యాపిటల్స్‌: డేవిడ్‌ వార్నర్‌ (సి) రిలే మెరెడిత్‌ (బి) బెహ్రెండార్ఫ్‌ 51, పృథ్వీషా (సి) గ్రీన్‌ (బి) షోకీన్‌ 15, మనీశ్‌ పాండే (సి) బెహ్రెండార్ఫ్‌ (బి) చావ్లా 26, యాశ్‌ధుల్‌ (సి) నేహల్‌ (బి) రిలే మెరెడిత్‌ 2, పోవెల్‌ (ఎల్‌బీడబ్ల్యు) (బి) చావ్లా 4, లలిత్‌ యాదవ్‌ (బి) చావ్లా 2, అక్షర్‌ పటేల్‌ (సి) అర్షద్‌ఖాన్‌ (బి0 బెహ్రండార్ఫ్‌ 54, పోరెల్‌ (సి) గ్రీన్‌ 9బి) బెహ్రెండార్ఫ్‌ 1, కుల్దిdప్‌ యాదవ్‌ (రనౌట్‌) నేహల్‌ 0, ఎన్రిచ్‌ నోర్టెజె (బి) రిలే మెరెడిత్‌ 5, రెహమాన్‌ (నాటౌట్‌) 1. ఎక్స్‌ట్రాలు 11 (మొత్తం 19.4 ఓవర్లలో 172)

వికెట్లపతనం: 33-1, 76-2, 81-3, 86-4, 98-5, 165-6, 166-7, 166-8, 166-9, 172-10.

బౌలింగ్‌: బెహ్రెండార్ఫ్‌ 3-0-23-3, అర్షద్‌ఖాన్‌ 1-0-12-0, గ్రీన్‌ 3-0-30-0, షోకీన్‌ 4-0-43-1, రిలే మెరెడిత్‌ 3.4-34-2, చావ్లా 4-0-22-3, తిలక్‌వర్మ 1-0-7-0.

Advertisement

తాజా వార్తలు

Advertisement