Wednesday, November 20, 2024

Wanindu Hasaranga | సాధారణ సభ్యుడిగా కొనసాగుతా..

శ్రీలంక జ‌ట్టు కెప్టెన్ వనిందు హసరంగ త‌న కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇక‌పై జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ స్పష్టం చేశాడు. హసరంగ రాజీనామాను శ్రీలంక క్రికెట్ బోర్డు ధృవీకరించింది. త్వ‌ర‌లో శ్రీలంక టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌ని ప్రకటించనున్నారు.

ఇక‌ హసరంగ గతేడాదే శ్రీలంక టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. అతను లంక జట్టు సారథిగా కేవలం పది మ్యాచ్‌ల్లో మాత్రమే వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో హసరంగ సారథ్యంలో శ్రీలంక నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒ‍కే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement