ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ టోర్నీ లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ చరిత్ర సృష్టించాడు. టైటిల్ పోరులో డానిల్ మెద్వెదేవ్(రష్యా)ను మట్టికరిపించి విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో ఇగా స్వియాటెక్ రెండోసారి చాంపియన్‌గా అవతరించింది. గత రాత్రి జరిగిన ఫైనల్లో అల్కరాజ్.. మెద్వెదేవ్‌ను చిత్తుగా ఓడించాడు. మరోవైపు ఉక్రెయిన్ స్టార్ మరియా సక్కారీని స్వియాటెక్ చిత్తు చేసింది. వరుస సెట్లలో ఆధిపత్యం చెలాయించిన ఈ పోలాండ్ స్టార్ 6-4, 6-0తో గెలుపొందింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ జన్నిక్ సిన్నర్ కు సెమీఫైనల్లో షాకిచ్చిన అల్కరాజ్ టైటిల్ పోరులో చెలరేగాడు. మెద్వెదేవ్‌కు చుక్కలు చూపించి 7-6, 7-1తో విజేతగా నిలిచాడు. దాంతో, నిరుడు వింబుల్డన్ ట్రోఫీ తర్వాత తొలిసారి అల్కరాజ్ డబ్ల్యూటీఏ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు నొవాక్ జకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్న రెండో ఆటగాడిగా స్పెయిన్ స్టార్ చరిత్ర సృష్టించాడు.