స్వీడన్‌లో జూన్ 22 నుంచి ప్రారంభంకానున్న ఉమెన్స్ అండర్ 23- 3దేశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు టీమిండియా జట్టు స్వీడెన్‌కు బయలుదేరి వెళ్లింది. హెచ్‌డ్ కోచ్ సురెన్ ఛెత్రీ నేతృత్వంలో బ్లూ టైగర్స్‌గా పేరుగాంచిన ఇండియన్ ఉమెన్స్ టీమ్ బుధవారంనాడు ఆతిథ్య స్వీడెన్‌తో తలపడనుంది. ఫీఫా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో స్వీడెన్ నం.2. ఆ జట్టుతో భారత్ తలపడి గెలవడం కష్టమే అయినా, ఈసారి టీమిండియా జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందని హెచ్ కోచ్ సురెన్ ఛెత్రీ ధీమా వ్యక్తం చేశారు.
2022 ఏప్రిల్‌లో జోర్డాన్‌లో అంతర్జాతీయ టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత జట్టులోని క్రీడాకారులందరూ ప్రతిభావంతులని కోచ్ ఛెత్రీ పేర్కొన్నారు. ఈసారి ఖచ్చితంగా టోర్నీ విజేతగా భారత్‌కు తిరిగొస్తామని హెచ్ కోచ్ సురెన్ ఛెత్రీ ఆశాభావం వ్యక్తం చేశారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.