Saturday, November 23, 2024

హెడ్‌కోచ్‌లుగా వీవీఎస్‌ లక్ష్మన్‌, కనిత్కార్‌… సెప్టెంబర్‌ 23 నుంచి ఆసియా గేమ్స్‌ పోటీలు

చైనా వేదికగా సెప్టెంబర్‌ 23 నుంచి ఆక్టోబర్‌ 8 వరకు ఆసియా గేమ్స్‌ పోటీలు జరగనున్నాయి. ఆసియాక్రీడల్లో తొలిసారి క్రికెట్‌ ఆటను కూడా ప్రవేశపెట్టారు. దీంతో ఈ క్రీడల్లో భారత్‌ తరఫున పురుషుల, మహిళా జట్లు బరిలోకి దిగుతున్నాయి. కాగా ఈ పోటీల కోసం బీసీసీఐ ద్వితీయ శ్రేణి పురుషుల జట్టును ఎంపిక చేసింది. ఆక్టోబర్‌ నెలలో వన్డే ప్రపంచకప్‌ పోటీలు ఉండటంతో సీనియర్ల స్థానంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. టీమిండియా పురుషుల జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహిస్తుండగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గైర్హజరీలో ఆసియా గేమ్స్‌ పురుషుల జట్టుకు వీవీఎస్‌ లక్ష్మన్‌ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. మహిళల జట్టుకు హృషికేష్‌ కనిత్కార్‌ హెడ్‌కోచ్‌గా వ్యవహరించన్నట్లు బీసీసీఐ వెళ్లడించింది. ఆక్బోబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ దృశ్య ద్రవిడ్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అతని స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మన్‌ ప్రధాన కోచ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు.

ప్రస్తుతం లక్ష్మన్‌ ఆలూరులో ఏర్పాటు చేసిన స్పేషల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో భారత ఆటగాళ్లను పర్యవేక్షిస్తున్నాడు. ఆసియ వన్డే ఛాంపియన్‌షిప్స్‌ కోసం విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, శుభ్‌మాన్‌ గిల్‌ తదితరులు ఈ క్యాంప్‌లో కఠోర సాధన చేస్తున్నారు. లక్ష్మన్‌ ఇంతకుముందు ఐర్లాండ్‌, జింబాబ్వే పర్యటనలతో పాటు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లకు టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. మరోవైపు లక్ష్మన్‌ పర్యవేక్షలోనే 2021లో టీమిండియా అండర్‌-19 ప్రపంచకప్‌ గెలుచుకుంది.

- Advertisement -

ఇక ఆసియా క్రీడలకు లక్ష్మణ్‌తో పాటు మరో మాజీ క్రికెటర్‌ హృషికేష్‌ కనిత్కార్‌ మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. మరోవైపు పురుషుల సహాయక సిబ్బందిలో బౌలింగ్‌ కోచ్‌గా సాయిరాజ్‌ బహుతులే, ఫీల్డింగ్‌ కోచ్‌గా మునీష్‌ బాలీ, మహిళల సహాయక సిబ్బందిలో రాజిబ్‌ దత్తా (బౌలింగ్‌ కోచ్‌), సుభదీప్‌ గోష్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌)గా సేవలందించనున్నారు. ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లు భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.

సెప్టెంబర్‌ 25న ముంబయిలో ఏజీఎమ్‌ మీటింగ్‌..

బీసీసీఐ 92వ అన్యువల్‌ జెనరల్‌ మీటింగ్‌ (ఏజీఎమ్‌) ముంబయి వేదికగా సెప్టెంబర్‌ 25న జరుగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఆదివారం వెళ్లడించింది. అంతకుముందు 18 ఆక్టోబర్‌ 2022లో ముంబైలో ఏజీఎమ్‌ మీటింగ్‌ జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement