Tuesday, November 26, 2024

నాలుగో టీ20లో సూర్యకుమార్ ఔట్‌పై దుమారం

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 13వ ఓవర్‌లో శామ్ కరణ్ వేసిన రెండో బంతిని సూర్యకుమార్ షాట్ ఆడగా డేవిడ్ మలాన్ క్యాచ్ అందుకున్నాడు. బంతి స్పష్టంగా మలన్ చేతిలో పడిందో లేదో తెలుసుకోకుండానే ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. అది రీప్లేలో నేలకు తాకుతున్నట్లు అనిపించడంతో థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకువెళ్లాడు. దాన్ని అనుమానాస్పదంగా భావించిన థర్డ్ అంపైర్ అంపైర్స్ కాల్‌గా ఔటివ్వడంపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీవీఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్ సహా పలువురు ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. సెహ్వాగ్ అయితే కళ్లకు గంతలు కట్టుకున్న పిల్లాడి ఫోటో పెట్టి సూర్యకుమార్ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ ఇలానే వ్యవహరించాడని వ్యంగ్యంగా విమర్శించాడు.

అటు సుందర్ ఔట్ విషయంలోనూ ఇలానే జరిగింది. బౌండరీ లైన్‌ను రషీద్ కాలు టచ్ చేసినా అంపైర్ ఔట్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. దీంతో కొందరు క్రికెట్ అభిమానులు మీమ్స్ రూపంలో వీడియోలను షేర్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement