టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు కోహ్లి ట్విటర్ వేదికగా ఓ లేఖను విడుదల చేశాడు. కాగా మొన్న కోహ్లీ టీట్వంటీలు వన్డేల నుంచి తప్పుకోనన్నాడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..అయితే ఓ బీసీసీఐ అధికారి దానిని ఖండిచారు. కాగా టీ20 వరల్డ్ కప్ తర్వాతా రోహిత్ శర్మ కు జట్టు పగ్గాలు అందిచనున్నాడు కోహ్లీ.
ఇది కూడా చదవండి: సోనూసూద్ ఇంటిపై రెండో రోజు ఐటీ రైడ్స్..