చారిత్రక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించిన ఇంక సంబరాలు చేసుకుంటూనే ఉంది. అతిథ్య జట్టుపై 151 పరుగుల తేడాతో గెలుపొందడంపై టీమిండియాపై సోషల్ మీడియా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టెయిలెండర్ల బ్యాటింగ్ చేసిన తీరుపై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వదేశంలో అయిన విదేశాల్లో అయిన టీమిండియా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లలో బరిలోకి దిగేది. అయితే విరాట్ కోహ్లీ ఈ ఫార్ములాను మర్చేశాడని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విజయం పై స్పందిస్తూ…తీవ్రమైన ఒత్తిడి మధ్య రెండో ఇన్నింగ్స్‌లో చాలా బాగా ఆడాం. బుమ్రా, షమీ అయితే అద్భుతం. 60 ఓవర్లలో ఫలితం రాబట్టడం మా లక్ష్యం. మైదానంలో వారి ఆటగాళ్లతో జరిగిన వాదనలు మాలో మరింత దూకుడును పెంచాయి. 2014లోనూ లార్డ్స్‌లో గెలిచినా…60 ఓవర్లలోపే విజయాన్ని అందుకోవడం ఎంతో ప్రత్యేకం. ఇక్కడ తొలి సారి టెస్టు ఆడిన సిరాజ్ బౌలింగ్ చేసిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడకు వచ్చి మాలో స్ఫూర్తి నింపిన భారత అభిమానులకు ఈ విజయం ఒక కానుక’ అని తెలిపాడు.
ఇది కూడా చదవండి: తొలి టెస్టులో పాకిస్థాన్‌పై వెస్టిండీస్ ఉత్కంఠభరిత విజయం