Monday, November 25, 2024

వివాదంలో విరాట్‌ కోహ్లీ.. వీడియో ఇదిగో

భార‌త క్రికెట‌ర్ విరాట్‌ కోహ్లీ ప‌దే ప‌దే వార్త‌ల్లోకి ఎక్కుతున్నాడు. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న వివాదంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.. కాగా, ఇప్పుడు ఆయ‌న‌ను మ‌రో వివాదం చుట్టుముట్టింది. దక్షిణాఫ్రికాతో జ‌రిగిన‌ చివరి వన్డేలో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ద‌క్షిణాఫ్రికా, భార‌త్ జట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి జాతీయ గీతాలాపన చేశారు. అయితే, ఆ సమ‌యంలో భారత ఆటగాళ్లు జాతీయ గీతం ఆల‌పిస్తుండ‌గా కోహ్లీ మాత్రం చూయింగ్‌ గమ్‌ నములుతూ గీతాలాపన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

జాతీయ గీతాలాప‌న స‌మ‌యంలో విరాట్ కోహ్లీ ప్ర‌వ‌ర్తించి తీరు బాగోలేద‌ని, చాలా పొగ‌రుగా వ్య‌వ‌హ‌రించాడ‌ని నెటిజ‌న్లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆయ‌న‌ జాతీయ గీతాన్ని అవమానించాడ‌ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. కాగా, కోహ్లీ ఇగోను ప‌క్క‌న‌పెట్టాలంటూ ఇటీవ‌లే క‌పిల్ దేవ్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా సూచించిన విష‌యం తెలిసిందే. జాతీయ గీతాలాప‌న స‌మ‌యంలో కోహ్లీ తీరు ఆయ‌న‌ను మ‌రోసారి చిక్కుల్లో ప‌డేసింది. కాగా, ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా పూర్తిగా విఫ‌లం కావ‌డం ప‌ట్ల కూడా నెటిజ‌న్లు తీవ్ర విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. ఆట‌పై దృష్టి పెట్టాల‌ని క్రికెట‌ర్ల‌కు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement