టాటా ఐపీఎల్ 2022 సీజన్ లో ఇప్పటిదాకా ఫామ్‌లో లేకుండా దారుణంగా ఆడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి బ్యాట్ జుళిపించాడు. గుజరాత్ టైటాన్స్ తో ఇవ్వాల (శనివారం) జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తనపై తీవ్రస్థాయిలో వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. 45 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి అందరి విమర్శలకు చెక్ పెట్టేశాడు. టోర్నీ ఆరంభం నుంచి పరుగుల దాహంతో అల్లాడుతున్న ఆర్సీబీ మాజీ సారథి ఈ మ్యాచ్ లో పాత కోహ్లీని చూపించాడు. మరో ఎండ్ లో రజత్ పాటిదార్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
నిర్ణీత ఓవర్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 170/6
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకోగా, కెప్టెన్ డుప్లెసిస్ ఆరంభంలోనే డకౌట్ అయ్యాడు. ఓపెనర్ గా బరిలో దిగిన కోహ్లీ… పాటిదార్ తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ప్రస్తుతం బెంగళూరు జట్టు స్కోరు 15 ఓవర్లలో 2 వికెట్లకు 117 పరుగులు. పాటిదార్ 32 బంతులాడి 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. కోహ్లీ 53 బంతుల్లో 58 పరుగుల వద్ద అవుటయ్యాడు. కాగా, కోహ్లీ స్కోరులో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.