Saturday, January 4, 2025

Vinod Kambli | కాలు క‌దిపిన కాంబ్లీ.. న‌ర్సుతో క‌లిసి డ్యాన్స్ !

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. యూరినరీ ఇన్ఫెక్షన్, మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి కారణాలతో ఆసుపత్రిలో చేరిన మాజీ క్రికెటర్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా కాంబ్లీ ఆస్పత్రి నర్సులతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు.

ఈ వీడియోలో కాంబ్లీ చక్ దే ఇండియా పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. దీంతో కాంబ్లీ త్వరగా కోలుకోవాలని కోరుతూ, షేర్లు, లైకులతో ఈ వీడియోను అభిమానులు షేర్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement