Friday, November 22, 2024

Wrestling | భారత జట్టు నుంచి వినేష్ ఫోగట్ ఔట్.. గాయంతో తప్పుకున్న స్టార్‌ రెజ్లర్‌

భారత స్టార్‌ మహిళ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తాను ఆసియా గేమ్స్‌లో పాల్గొనడంలేదని వెల్లడించింది. మోకాలి గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నా అని ఫొగాట్‌ మంగళవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. కొద్ది రోజుల క్రితమే ఈ స్టార్‌ రెజ్లర్‌కు ఆసియా క్రీడాల్లో నేరుగా ప్రవేశం లభించింది.

ఈమెతో పాటు బజరంగ్‌ పునియాకు కూడా ఆసియా గేమ్స్‌ ట్రయల్స్‌ నుంచి మినహాయింపు లభించింది. దీంతో ఇతర రెజ్లర్‌ ఈ విషయంపై అభ్యంతరం తెలుపారు. ట్రయల్స్‌ నిర్వహించకుండా నేరుగా వారికి ఎలా అవకాశలిస్తారని భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై విమర్శలు ఆగ్రాహం వ్యక్తం చేశారు.

దీంతో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత్‌కి ప్రాతినిథ్యం వహించిన వినేశ్‌ ఫొగాట్‌ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. అయితే ఆదివారం ప్రాక్టీస్‌ చేస్తుండగా ఎడమ మోకాలికి గాయమైందని ఫొగాట్‌ తెలిపింది. వెంటనే వైధ్యులను సంప్రదించి స్కాన్లు, ఇతర పరీక్షలు చెయించా. రిపోర్టులు చూసిన వైధ్యులు సర్జరీ తప్పనిసరని సూచించారు. అందుకే ఆసియా క్రీడల నుంచి వైదొలుగుతున్నానని ఫొగాట్‌ తన పోస్టులో పేర్కొంది.

ఈ ఏడాది కూడా బంగారు పతకం సాధించాలని కలలు కన్నాను. కానీ గాయంతో అవి ఆవిరయ్యాయి. తన స్థానంలో రిజర్వు ఆటగాళ్లకు పంపే వీలుంటుందని ఈ విషయాన్ని ముందే సంబంధిత అధికారులకు తెలియజేశానని వినేశ్‌ తెలిపింది. త్వరలోనే కోలుకొని 2024లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొంటానని ఆశభావం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement