సన్‌రైజర్స్ హైదరాబాద్ లోకి కొత్త ఆటగాడు వచ్చాడు. గాయం కారణంగా ఐపీఎల్ 17 సీజన్ మొత్తానికి దూరమైన వానిందు హసరంగ స్థానంలో శ్రీలంకకే చెందిన మరో లెగ్ స్పిన్నర్ విజయ్‌కాంత్ వియస్కాంత్ ను సన్‌రైజర్స్ తీసుకుంది.
ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌ల కోసం విజయ్‌కాంత్‌ను అతడి బేస్ ధర రూ.50 లక్షలకు హైదరాబాద్ జట్టులో చేర్చుకుంది.
- Advertisement -
ఈవిషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. 22 ఏళ్ల విజయ్‌కాంత్ ఇప్పటివరకు ఫ్రాంచైజీ క్రికెట్లో 33 టీ20లు ఆడి 42 వికెట్లు పడగొట్టాడు. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఎడమ మడమ నొప్పి కారణంగా వానిందు హసరంగ ఈ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు అతడిని గత ఏడాది మినీ వేలంలో సన్‌రైజర్స్ రూ.1.5 కోట్లకు దక్కించుకుంది.