టీ20 వరల్డ్ కప్ భాగంగా నేడు ఉదయం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. నమీబియాతో బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కెప్టెన్ గ్రెర్హార్డ్ ఎరాస్మస్ (52) అర్ధశతకం సాధించాడు.
అనంతరం ఛేజింగ్‌కు దిగిన స్కాట్లాండ్ అదరగొట్టింది. నమీబియా నిర్ధేశించిన 156 పరుగుల టార్గెట్‌ను 18.3 ఓవర్లలోనే చేధించింది. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (47 నాటౌట్), మైకేల్ లీస్క్ (35) సత్తాచాటారు. ఈ విజయంతో గ్రూప్-బీలో ఉన్న స్కాట్టాండ్ జట్టు మూడు పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. చెరో పాయింట్ దక్కింది. ఇక గ్రూప్ బీలోని ఆస్ట్రేలియా (2), నమీబియా (2), ఇంగ్లండ్ (1) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఒమన్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.