మహిళల ఆసియా కప్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు బోణీ కొట్టింది. దంబుల్లా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో బంగ్లాను చిత్తుగా ఓడించి… తొలి మ్యాచ్‌లోనే భారీ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ బంగ్లాదేశ్ జట్టును స్వల్ప పరుగులకే కట్టడి చేసిన శ్రీలంక మహిళల జట్టు…. అనంతరం చేజింగ్‌లోనూ అదరగొట్టింది.
బంగ్లాదేశ్ మహిళల జట్టు నిర్ధేశించిన 112 పరుగుల స్వల్ప ఛేదనలో.. శ్రీలంక ఓపెనర్ విష్మి గుణరత్నే (52) హాఫ్ సెంచరీతో కదం తొక్కగా.. హర్షిత మాధవి సమరవిక్రమ (33) తో ఆకట్టుకుంది. ఇక ఆకర్లో కవిషా దిల్హరి (12 నాటౌట్) మెరుపు బ్యాటింగ్ చేసింది. దీంతో దీంతో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.