వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో బార్బొరా క్రెజికోవా విజేతగా అవతరించింది. ఇవ్వాల శనివారం జరిగిన ఉత్కంఠ ఫైనల్ పోరులో జాస్మినె పవోలినిపై 6-2,2-6, 6-4తో గెలిచి కెరీర్‌లోనే తొలిసారి వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడింది. ట్రోఫీతో పాటు బార్బొరా రూ.28.5 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. అయితే, ఇది ఆమెకు రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2021లో బర్బొరా ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అవతరించింది. ఇప్పుడు మళ్లీ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీతో మెరిసి తన వింబుల్డన్ కలను నిజం చేసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement