ఐపీఎల్ 17వ సీజన్లో లక్నో అదరగొట్టేస్తోంది. ఆడిన నాలుగింట్లో తొలి మ్యాచ్‌లోనే ఆ జట్టు ఓడిపోయింది. హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. 160+ స్కోరును డిఫెండ్ చేసి గుజరాత్‌ను ఓడించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఆ జట్టుపై లక్నోవూ విజయం సాధించింది. ఇప్పటి వరకూ 160+ స్కోరు చేసిన 13 మ్యాచుల్లోనూ లఖ్‌నవూ విజయం సాధించడం విశేషం.
”తక్కువ స్కోరును కాపాడుకోవడం ఆనందంగా ఉంది. యువ బౌలర్లతో మెరుగ్గా రాణిస్తున్నాం. ముగ్గురు స్పిన్నర్లు అదరగొట్టారు. యశ్ ఠాకూర్, కృనాల్ పాండ్య వల్లే ఈ విజయం సాధ్యమైంది. సిద్ధార్థ్ కూడా కొత్త బంతితో కీలక పాత్ర పోషించాడు. బిష్ణోయ్ క్యాచ్ అద్భుతం. తొలుత బ్యాటింగ్ చేసేటప్పుడే పిచ్ పరిస్థితిపై అంచనాకు వస్తాం. మా బౌలర్లూ దానికి తగ్గట్టుగా బౌలింగ్ చేశారు. 160+ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లోనూ విజయాలు సాధించడం బాగుంది. ఎలాంటి పిచ్‌పై ఆడామనేది చాలా కీలకం. గత సీజన్లోనూ మేం ఇదే జట్టుతో బరిలోకి దిగాం. అప్పటి కంటే మెరుగ్గా రాణిస్తున్నాం. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నెట్స్‌లో ఆటగాళ్లతో చర్చిస్తాం. గుజరాత్‌పై విజయంతో మేం హ్యాట్రిక్ సాధించాం” అని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.
బ్యాటింగ్‌కు అనుకూలమే.. కానీ: గిల్
”పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉందనిపించింది. మా ఆటతీరే నిరాశపరిచింది. మంచి ఆరంభం దక్కినా.. మిడిల్లో కొనసాగించలేకపోయాం. బౌలింగ్ పరంగా వారిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగాం. లక్నో దూకుడు చూస్తే మరో 20 పరుగులు చేస్తారనిపించినా అడ్డుకున్నాం. డేవిడ్ మిల్లర్ లేకపోవడం నష్టమే. అతడు ఉంటే కచ్చితంగా మార్పు ఉండేది. పవర్‌ప్లే చివరి ఓవర్లో దూకుడుగా ఆడి పరుగులు రాబడదామని భావించా. ఈ క్రమంలో వికెట్‌ను సమర్పించా. మా బ్యాటింగ్‌పై ఇంకాస్త దృష్టిసారించాల్సిన అవసరం ఉంది” అని గుజరాత్ కెప్టెన్ గిల్ వ్యాఖ్యానించాడు.