భారత దేశానికి ఎన్నో గొప్ప పతకాలు అందించి, దేశ ఖ్యాతిని చాటిచెప్పిన గొప్ప క్రీడాకారుడు వరీందర్ సింగ్ ఇక లేరు. ఇవ్వాల జలంధర్‌లో ఆయన కన్నుమూశారు. 1970లలో దేశం సాధించిన గొప్ప విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఒలింపిక్, ప్రపంచకప్ పతక విజేత వరీందర్ సింగ్ (75) చనిపోయారన్న వార్త తెలిసి క్రీడా లోకం కన్నీరుపెడుతోంది. 1975లో కౌలాలంపూర్‌లో జరిగిన పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న భారత హాకీ జట్టులో సింగ్ ఒకరు. ఇప్పటికీ అద్భుతమైన ఆట తీరు కనబరచడం ఆయనలో ఉండే ప్రత్యేకత. ఎందుకంటే భారతదేశం పాకిస్థాన్‌ను 2-1తో ఓడించి సాధించిన ఏకైక స్వర్ణ పతకం అదే.
మ్యూనిచ్‌లో జరిగిన 1972 సమ్మర్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, 1973 ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న జట్లలో కూడా సింగ్ ఆడారు. అతను 1974, 1978లో వరుసగా ఆసియా క్రీడలలో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఈ భారత దిగ్గజ హాకీ క్రీడాకారుడు 1975లో మాంట్రియల్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో కూడి పాల్గొన్నారు. గౌరవనీయమైన ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును 2007లో వరీందర్‌కు అందుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.