ఫైనల్లో భారత్‌ను ఆపడం చాలా కష్టమని కీవీస్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ పేర్కొన్నారు. ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అని విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. భారత్ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే ఫైనల్లో ఆపడం ఏ జట్టుకైనా కష్టతరమేనని అభిప్రాయపడ్డాడు.
భారత ఆటగాళ్లు అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నారని, ఒక్క ఓటమి కూడా లేకుండా చెలరేగుతున్న ఆతిథ్య జట్టుని ఫైనల్లో ఆపడం అంత సులభం కాబోదని అన్నాడు. ‘‘ సాధారణంగా వైఫల్యాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో ఎలా వ్యవహరిస్తామనేది ముఖ్యం. కానీ టీమిండియా ఈ టోర్నీలో నిజంగా అద్భుతంగా ఆడుతోంది. కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్ చేరుకున్నారు. రౌండ్-రాబిన్ ప్రతి మ్యాచ్‌లోనూ అదరగొట్టారు. సెమీఫైనల్లోనూ అదే చేశారు. ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌కు వెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదు. సెమీ-ఫైనల్‌లో టీమిండియా గెలుపు త్వర్వాత కేన్ విలియమ్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.