Monday, September 16, 2024

Verdict Today – ఆ తీర్పు కోసం దేశ‌మంతా ఎదురు చూపులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ అనర్హతపై ఎలాంటి తీర్పు రానుందోనని యావత్‌ క్రీడా ప్రపంచం ఊపిరిబిగబట్టి ఆత్రుతగా ఎదురుచూస్తోంది. పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 50 కిలోల కేటగిరీలో ఫొగట్‌ కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంతో ఆమెను ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేశారు.
దీనిపై ఆమె కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (కాస్‌)ను ఆశ్రయించింది. కనీసం తనకు రజతమైనా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కాస్‌కు వినేశ్‌ అప్పీలు చేసుకుంది. దీనిపై వాదనలు జరగగా.. మంగళవారం తుది తీర్పు వెలువడనుంది. కాగా, నిబంధనల ప్రకారం రెండు రజతాలు ఇవ్వడం సాధ్యం కాదని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ చీఫ్‌ లలోవిచ్‌ చెప్పారు. కానీ, కోర్టు తీర్పు ప్రకారం నడుచుకొంటామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement