Home క్రీడాప్రభ Engagement | సింపుల్‌గా ఒలింపియ‌న్ నిశ్చితార్థం..

Engagement | సింపుల్‌గా ఒలింపియ‌న్ నిశ్చితార్థం..

0
Engagement | సింపుల్‌గా ఒలింపియ‌న్ నిశ్చితార్థం..

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రెండు సార్లు ఒలింపిక్ ప‌త‌కాల‌ విజేత‌ పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు వెంకట దత్తసాయి-పివి సింధుల‌ నిశ్చితార్థం జరిగింది. తనకు కాబోయే భర్త వెంకట్‌తో… సింధు ఉంగ‌రాలు మార్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కాగా, పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయితో కలిసి సింధు ఈ నెల 22న ఉదయపూర్ వేదికగా ఏడడుగులు వేయనుంది. దీంతో ఇరువురి కుటుంబాలు పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్నాయి.

Exit mobile version