భారత షూటర్లు వరుణ్ తోమర్, ఈషా సింగ్‌లు పారిస్ 2024 ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఇవ్వాల (సోమవారం) జకర్తాలో జరిగిన ఆసియన్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఫైనల్లో 10 మీటర్లు ఎయిర్ పిస్టల్ విభాగంలో వరుణ్, ఈషా అద్భుత ప్రదర్శన కనబరిచారు. వరుణ్ 2.6, ఈషా 6.8లతో అదరగొట్టారు. దీంతో పారిస్ ఒలింపిక్స్ వరుణ్, ఈషా అర్హత సాధించారు. భారత్ తరఫున ఇప్పటి వరకూ పారిస్ ఒలింపిక్స్‌కు 13 బెర్తులు దక్కించుకోగా, తాజాగా వరుణ్ తోమర్ 14, ఈషా సింగ్ 15వ బెర్త్ దక్కించుకున్నారు.
20ఏళ్ల ఆర్మీ మార్క్స్‌మాన్ వరుణ్ గత ఏడాదే సీనియర్ టీమ్‌లో స్థానం సంపాదించుకోగా, ఈషా ఇంకా జూనియర్ టీమ్‌లోనూ కొనసాగుతోంది. జకర్తాలో ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ విభాగంలో భారత మరో షూటర్ అర్జున్ చీమా మెన్స్ పిస్టోల్ విభాగంలో సిల్వర్ మెడల్ చేజిక్కించుకోగా ఉమెన్స్ విభాగంలో రిథమ్ సాంగ్వన్ కాంస్యం పతకంతో సరిపెట్టుకుంది. మంగోలియన్ షూటర్ దవ్వాఖు ఏఖ్తాయివన్ కాంస్యం కైవసం చేసుకుని పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
అలాగే పాకిస్తాన్ షూటర్ కిష్మలా తలాట్ సిల్వర్ మెడల్ దక్కించుకుని ఉమెన్స్ షూటింగ్ విభాగంలో ఒలింపిక్స్‌కు పాక్ తరఫున అర్హత సాధించింది. భారత్‌కు రెండు బెర్త్లుండగా, వరుణ తోమర్ చేజిక్కించుకోవడంతో అర్జున్ సింగ్ చీమా నిరాశ ఎదురైంది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో వరుణ్ తోమర్ 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. విశ్వ క్రీడల పోటీలో ఇదే అతని అత్యుత్తమ గణాంకాలు.
అలాగే పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో వరుణ్ తోమర్, అర్జున్ సింగ్ చీమా, ఉజ్వల్ మాలిక్ బృందం పసిడి పతకం చేజిక్కించుకుంది. ఫైనల్లో వరుణ్ తోమర్ (586), అర్జున్ సింగ్ చీమా (579), ఉజ్వల్ మాలిక్ (575) పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. భారత షూటర్ల దెబ్బకు రెండు, మూడు స్థానాలకే పరిమితమైన ఇరాన్, కొరియా షూటర్లు వెండి, కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
మరో విషయం ఏంటంటే… వ్యక్తిగత విభాగంలో వరుణ్ తోమర్, అర్జున్ సింగ్ చీమాలు ఫైనల్ చేరుకుని పతకాలు ఖాయం చేశారు. అటు మహిళ విభాగంలో 10 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ తొలి స్థానంలో నిలిచి పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈషా (243.1), రిథమ్ (214.5) నిలిచిపోయింది. దీంతో సాంగ్వన్ పారిస్ ఒలింపిక్స్ ఆశలు అడియాశలయ్యాయి.
టీమ్ విభాగంలో వరుణ్, అర్జున్, ఉజ్వల్ బృందం గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే ఉమెన్స్ టీమ్ విభాగంలో ఈషా, రిథమ్, సురభి స్వర్ణ పతకం చేజిక్కించుకుంది. మొత్తం ఆసియన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత షూటర్లు ఆరు గోల్డ్ మెడల్స్ సాధించారు. జూనియర్స్ మెన్స్ ఎయిర్ పిస్టోల్ విభాగంలో ఫైనల్లో ఫియాన్షు యాదవ్ 154.3తో ఉండగా, టాప్ క్వాలిఫయర్స్‌లో 579తో అగ్రస్థానం నిలిచాడు. పరాస్ ఖోలా 562తో 9వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
సక్సేనా మరో రికార్డు
తిరువనంతపురం: డొమెస్టిక్ క్రికెట్లో ఆల్-రౌండర్‌గా గుర్తింపు పొందిన 37ఏళ్ల జలజ్ సక్సేనా రంజీ ట్రోఫీ టోర్నమెంట్లో రికార్డు సృష్టించాడు. 9వేల పరుగుల మైలురాయిని అధిగమించడంతోపాటు, 600 వికెట్లు పడగొట్టిన క్రీడాకారుడిగా సక్సేనా మూడో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్లో మదన్ లాల్, వినూ మన్డ్ ఈ ఫీట్‌ను సాధింంచిన విషయం తెలిసిందే. జలజ్ సక్సేనా కేరళ స్టార్‌గా గుర్తింపు పొందాడు. 2005లో మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో క్రికెట్ ప్రయాణం మొదలెట్టాడు. ఇన్నేళ్లుగా రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నప్పటికీ ఇండియన్ టీమ్‌కు ఎంపిక కాలేకపోయారు. అయితే ఏనాడూ నిరుత్సాహ పడకుండా దేశీయ టోర్నమెంట్లలో తనదైన శైలిలో ఆడుతూ ఎన్నో మైలురాళ్లును అధిగమిస్తున్నాడు.