పారిస్ : వలెన్సియా కొత్త కోచ్‌గా గెన్నారో గట్టుసో నియమితుడయ్యాడు. లాలిగా గురువారం ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఈ పదవిలో జోస్ బొర్డలాస్ కొనసాగాడు. 44 ఏళ్ల గెన్నారో 13 ఏళ్లపాటు మిడ్ ఫీల్డర్‌గా వ్యవహరించాడు. 2020లో గెన్నారో…. నెపోలీలో నిర్వహించిన పోటీల్లో ఇటాలియన్ కప్‌ను గెలుచుకున్నాడు.
ఫుట్‌బాల్ అంటే నాకు ఎంతో ఇష్టం. అది నా ప్రాణం’అని సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గెన్నారో తన మనోభీష్టాన్ని పంచుకున్నాడు. తదుపరి రెండు సీజన్లకు మాత్రమే గెన్నారో పనిచేస్తాడు. నెపోలి జట్టుకు 2020లో బాస్‌గా వ్యవహరించిన గెన్నారో.. సింగిల్ పాయింట్ తేడాతో గేమ్ ఓడిపోవడంతో ఆ పదవిని కోల్పోయాడు. కాగా ఈ జట్టుకు గెన్నారో పదో కోచ్ కావడం గమనార్హం
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.