Tuesday, November 12, 2024

Jr.Hockey WC | భారత కెప్టెన్‌గా ఉత్తమ్‌ సింగ్‌.. డిసెంబర్‌లో జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌

ప్రస్తుతం క్రికెట్‌తో పాటు హాకీలో కూడా భారత్‌ అద్భుతంగా రాణిస్తోంది. సీనియర్‌, జూనియర్‌.. పురుషుల, మహిళల విభాగంలో టీమిండియా సత్తా చాటుతోంది. ఇక డిసెంబర్‌లో మలేషియా వేదికగా మరో మెగా టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో జూనియర్‌ పురుషుల హాకీ ప్రపంచకప్‌ మెగా సమరం పోటీలు జరగనున్నాయి. డిసెంబర్‌ 5 నుంచి 16 వరకు కౌలలంపూర్‌ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది.

భారత జట్టుకు ఫార్వర్డ్‌ ప్లేయర్‌ ఉత్తమ్‌ సింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత హాకీ సమాఖ్య 20 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. అందులో ఇద్దరు గోల్‌ కీపర్లు ఉన్నారు. భారత జట్టుకు ఉత్తమ్‌ సింగ్‌ నాయకత్వం వహిస్తున్నాడు. వైస్‌ కెప్టెన్‌గా అరాయ్‌జీత్‌ సింగ్‌ హుందల్‌ ఎంపికయ్యాడు. 2016లో టీమిండియా వరల్డ్‌ ఛాంపియన్‌గా అవతరించింది.

ఇప్పుడు అదే స్ఫూర్తితో మరోసారి పటిష్టమైన భారత జట్టును ఎంపిక చేశామని భారత హాకీ సమాఖ్య పేర్కొంది. టీమిండియాకు సీఆర్‌ రమేశ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న టీమిండియా మరో ప్రపంచకప్‌ ట్రోఫీపై భారత్‌ కన్నేసింది. వరల్డ్‌కప్‌ ట్రోఫే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నమని కోచ్‌ రమేశ్‌ వెల్లడించారు. ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌ గ్రూప్‌-సిలో ఉంది.

గ్రూప్‌-సిలో భారత్‌తో పాటు దక్షిణ కొరియా, కెనడా, స్పెయిన్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్‌-ఎలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చీలీ, ఆతిథ్య మలేషియాలు ఉన్నాయి. గ్రూప్‌-బిలో ఈజిప్టు, ఫ్రాన్స్‌, జర్మనీ, దక్షిణాఫ్రికాలు ఉన్నాయి. గ్రూప్‌-డిలో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, బెల్జియం, నెదర్లాండ్స్‌ జట్లు ఉన్నాయి. ఇక భారత్‌ తన తొలి మ్యాచ్‌ డిసెంబర్‌ 5న పటిష్టమైన దక్షిణ కొరియాతో ఢీ కొననుంది. 7న స్పెయిన్‌, 9న కెనడాతో తలపడనుంది.

- Advertisement -

భారత్‌ స్క్వాడ్‌:

గోల్‌ కీపర్లు: మోహిత్‌ హెచ్‌ఎస్‌, రణ్‌ విజయ్‌సింగ్‌ యాదవ్‌.
డిఫెండర్లు: శారదానంద్‌ తివారీ, అమన్‌ దీప్‌ లక్రా, రోహిత్‌, సునీస్‌ జోజో, అమీర్‌ అలీ.
మిడ్‌ ఫీల్డర్లు: విష్ణుకాంత్‌ సింగ్‌, పూవన్న సీబీ, రాజిందర్‌ సింగ్‌, అమన్‌దీప్‌, అదిత్య సింగ్‌.
ఫార్వర్డర్లు: ఉత్తమ్‌ సింగ్‌ (కెప్టెన్‌, ఆదిత్య లలాగే, అరాయ్‌సిత్‌ సింగ్‌ హుందల్‌ (వైస్‌ కెప్టెన్‌, సౌరభ్‌ ఆనంద్‌ కుశ్వహా, సుదీప్‌ చిర్మకో, బాబీ సింగ్‌ ధామి.
రిజర్వ్‌ ప్లేయర్లు: సుఖ్విందర్‌, సునిత్‌ లక్రా.

Advertisement

తాజా వార్తలు

Advertisement