ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా మహిళలు మరో రసవత్త పోరుకు సిద్ధమయ్యారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ మహిళల జట్లు తలపడనున్నాయి.
టోర్నీలోని మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన యూపీ వారియర్స్.. ఆ తరువాతి రెండు మ్యాచ్‌లలో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్స్‌తో మూడవ స్థానంలో నిలిచింది. మరోవైపు, స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్‌సీబీ.. రెండు విజయాలతో కొత్త ఎడిషన్‌ను ప్రారంభించింది. ఆ తరువాత జరిగిన రెండు మ్యాచ్‌లలో వరుసగా ఓడిపోయారు. దీంతో పాయింట్స్ టేబుల్‌లో నాలుగవ స్థానానికి పడిపోయారు. దీంతో వరుస పరాజయాలతో వెనుపడన ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌తో తిరిగి విన్నింగ్ ట్రాక్‌లోకి రావాలని భావిస్తొంది. మరోవైపు, యూపీ వారియర్స్ తన విజయ పరుగును కొనసాగించాలని కోరుకుంటుంది.
అయితే, చిన్న స్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఆఖరి మ్యాచ్ ఇదే కానుంది. ఈ మ్యాచ్ అనంతరం ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లతో సహా మిగిలిన మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తుంది. పట్టికలో రెండు, మూడవ స్థానంలో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు మార్చి 17న జరగనున్న ఫైనల్స్ ఆడనుంది.