Tuesday, November 26, 2024

గురితప్పని బుల్లెట్‌! రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ చాటిన కాకినాడ కుర్రాడు..

రైఫిల్‌ షూటింగ్‌ పేరు వినగానే ఒలింపిక్స్‌లో బంగారు పతాకం సాధించిన అభినవ బింద్రానే గుర్తుకొస్తాడు. ఆ స్థాయికి చాలామంది రైఫిల్‌ షూటింగ్‌లో ఎదగాలని కలలుగంటారు. కాగా కొద్దిమంది మాత్రమే లక్ష్యాన్ని చేధిస్తారు. ఈ క్రీడలో ఆసక్తిగల కాకినాడ స్మార్ట్‌సిటీకి చెందిన షేక్‌ సాధిక్‌ఖాన్‌ చిరుప్రాయంలోనే సత్తా చాటి పలు పతాకాలు కైవసం చేసుకున్నారు. రైఫిల్‌ షూటింగ్‌లో అడుగుపెట్టిన ఏడాదినుంచి పతాకాల వేట సాగించారు. ఇటీవల జరిగిన నేషనల్‌ ఆసియా క్రాస్‌బో షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జాతీయ ఆసియా ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. త్వరలో జరిగే అంతర్జాతీయ రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఖాన్‌ను పలువురు అభినందించారు. షేక్‌ సాధిక్‌ఖాన్‌ రైఫిల్‌షూటింగ్‌ క్రాస్‌బోలలో జాతీయస్థాయిలోప్రతిభ కనబరుస్తున్నాడు. ఆయన తండ్రి ఖాన్‌కు చిన్నతనంనుండే రైఫిల్‌ షూటింగ్‌ అంటే ఇష్టం, ఆసక్తిని గుర్తించి అందులో తర్ఫీదునిప్పించారు.

ఖాన్‌ తొలిసారిగా పిఆర్‌జిఎన్‌సిసిలో జరిగిన పోటీల్లో గోల్డ్‌మెడల్‌ సాధించాడు. అనంతరం డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రైఫిల్‌ పోటీల్లో సిల్వర్‌ మెడల్‌ సాధించారు. 2013లో నేషనల్‌ రైఫిల్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. 2017 స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ తరఫున రాష్ట్రజట్టులో ఎంపికయ్యారు. ఏడాదిగా శిక్షణ పొందుతుండగానే పలు పతాకాలు ఆయన సొంతమయ్యాయి. రాష్ట్ర, జాతీయస్థాయిలో ఐఎస్‌ఎస్‌ఎఫ్‌కు సంబంధించిన రైఫిల్‌ పోటీల్లో పతాకాలను కైవసం చేసుకోవడం విశేషం. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలో పలువురు చిన్నారులకు ఖాన్‌ శిక్షణ ఇస్తున్నారు. 2020లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఈయన వద్ద శిక్షణ పొందిన విద్యార్ధులు ప్రతిభ చాటారు. మహారాష్ట్రకు చెందిన 8మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement