Tuesday, November 26, 2024

World Cup Under 19 – నేడే ఇండియా – ఆసీస్ మధ్య ఫైన‌ల్స్‌

కుర్రాళ్ల మ‌ధ్య ట‌ఫ్ మ్యాచ్‌
అండర్ 19 ఫైన‌ల్స్‌లో గెలిచేదెవ్వ‌రు
అయిదుసార్లు విశ్వ‌విజేతగా భార‌త్‌
మూడు సార్లు క‌ప్పు నెగ్గిన ఆసీస్‌
ఆసాంతం పోరాడుతూ వ‌స్తున్న ఆస్ట్రేలియా
ఈజీగా తీసుకోవ‌ద్దంటున్న సీనియ‌ర్లు
ఉత్కంఠ‌గా మార‌నున్న‌ ఇరు జ‌ట్ల పోటీ

క్రికెట్ అంటేనే టీమిండియా.. అటు టెస్ట్‌లు, వ‌న్డేలు, టీ20ల్లో సీనియ‌ర్లు దూసుకెళ్తుంటే.. అదే దారిలో జూనియ‌ర్లు కూడా కుమ్మేస్తున్నారు. ఇప్ప‌టికే అయిదు సార్లు అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌ని సొంతం చేసుకుని రికార్డులు సాధించారు. ఇక‌.. నేడు మ‌రోసారి అండ‌ర్ 19 ఫైన‌ల్ స‌మ‌రం జ‌ర‌గ‌నుంది. దీనికి భార‌త కుర్ర‌ళ్లు దుమ్ము దులిపి మళ్లీ ఫైనల్స్‌లో చేరారు. ఆదివారం సౌతాఫ్రికాలోని విల్లోమూర్ పార్క్ బెనోనిలో ట‌ఫ్ ఫైట్‌ జరగనుంది. ఇప్పటివరకు టీమ్ ఇండియా యువ జట్టు ఐదుసార్లు విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో తలపడనున్న ఆస్ట్రేలియా మూడు సార్లు ప్రపంచ కప్ కొట్టింది. ఈ లెక్కన చూస్తే ఆస్ట్రేలియాను టీమ్ ఇండియా తేలికగా తీసుకోకూడదని సీనియర్లు అంటున్నారు.
మధ్యాహ్నం 1.30 మ్యాచ్‌ ప్రారంభం

ఇంతవరకు అండర్ 19 టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా యువ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓటమి అన్నదే ఎరగకుండా ఫైనల్‌కి చేరింది. భారీ రన్స్ తేడాతో లీగ్ దశలో గెలిచినప్పటికీ.. సెమీఫైనల్‌లో మాత్రం తడబడింది. చివరకు దాస్, కెప్టెన్ ఉదయ్ ఇద్దరూ సమయోచితంగా ఆడి మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చారు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.

త‌డ‌బ‌డుతూ ఫైన‌ల్ చేరిన ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా అయితే టోర్నీ ఆసాంతం తడబడుతూనే గెలుస్తూ వచ్చింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకు విజయం దోబుచులాడుతూనే ఉంది. ఎట్టకేలకు 3 రన్స్ 6 బాల్స్ చేయాల్సిన పరిస్థితుల్లో ఒక ఫోర్ రావడంతో చచ్చీచెడి ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఈ లెక్కన, అంకెలన్నీ చూస్తే ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్ భారత్ లాగే కనిపిస్తోంది. అంతేకాదు ఒత్తిడిలో నుంచి కూడా ఒడ్డున పడగలదని సెమీఫైనల్ మ్యాచ్‌లో నిరూపించింది. అందువల్ల కచ్చితంగా టీమ్ ఇండియా ఆరోసారి కూడా కప్ గెలిచి విజయ ఢంకా మోగిస్తుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

పాత జ్ఞాప‌కాలు.. మ‌ళ్లీ అదే రిపీట్‌

- Advertisement -

జట్టు సమీకరణాలు, ఆటగాళ్ల సెంచరీలు, విజయాలు ఇలాంటి లెక్కలు, ఆటలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆఖరి వరకు పోరాడటమే కంగారుల నైజం. 2023 వన్డే వరల్డ్ కప్‌లో సీనియర్ జట్టుకి తగిలిన గాయం ఎవరూ మరిచిపోలేనిది. మరొక్కసారి ఆస్ట్రేలియా-ఇండియా యువ జట్టు కూడా తలపడటంతో ఆ చేదు జ్నాపకాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి మరీ కుర్రాళ్లు ఆ కోరిక తీర్చి, భారతీయులకు ఒక బహుమతినిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement