అండర్-19 ప్రపంచకప్ ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో తొలిరోజు దక్షిణాఫ్రికా– వెస్టిండీస్, ఐర్లాండ్–అమెరికా జట్లు తలపడతున్నాయి. ఇక రేపు (శనివారం) జరగనున్న మ్యచ్‌లో భారత్ తమ తొలి బంగ్లాదేశ్‌తో ఆడనుంది. యువ భారత్‌కు ఉదయ్ సారథ్యం వహిస్తుండగా.. ఇప్పటికే ఐపీఎల్ అవకాశం దక్కించుకున్న తెలంగాణ కుర్రాడు అరవల్లి అవనీశ్‌రావు, అర్షిన్ కులకర్ణిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ టోర్నీని ఇప్పటి వరకు 14 సార్లు నిర్వహించగా.. అందులో అత్యధికంగా భారత్ ఐదుసార్లు (2000, 2008, 2012, 2018, 2022) విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా మూడు సార్లు టైటిల్ గెలవగా.. పాకిస్థాన్ రెండు సార్లు గెలిచింది.
ఇవ్వాల్టి నుంచి (జనవరి 19) నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తంగా 41 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో ఆడనుండగా.. వాటిని 4 గ్రూపులుగా విభజించారు.
అందులో గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఎస్‌ఏ జట్లు ఉన్నాయి.
గ్రూప్-బిలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, స్కాంట్లాండ్ ఉన్నాయి.
గ్రూప్-సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా ఉండగా..
గ్రూప్-డిలో అప్ఘానిస్థాన్, పాకిస్థాన్, న్యూజిలాండ్, నేపాల్ జట్లు ఉన్నాయి.
గ్రూపు దశలో పాయింట్ల పట్టికలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన 12 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి.
సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు ఆడిస్తారు. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 11న తుది పోరు జరగనుంది.