Wednesday, November 20, 2024

Under-19 WC | మ‌రో పోరుకు సిధ్దమైన యువ‌భార‌త్ !

దక్షిణాఫ్రికా వేదికగా అండ‌ర్ 19 వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా జరగుతున్నాయి. కాగా, ఇప్పటికే తమ మొదటి మ్యాచ్‌లో బంగ్లాపై 84 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం చేసింది యంగ్ ఇండియా. ఇక ఇప్పుడు మరో పోరుకు సిద్దమైంది. రేపు (గురువారం) బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ తో తలపడనుంది.

భార‌త జ‌ట్టు
ఉదయ్ సహారన్ (సి), మురుగన్ అభిషేక్ , ఆదర్శ్ సింగ్ , ఆరవెల్లి అవనీష్ , సచిన్ దాస్ , ధనుష్ గౌడ , అర్షిన్ కులకర్ణి , రాజ్ లింబాని , ఇన్నేష్ మహాజన్ , ప్రియాంషు మోలియా , ముషీర్ ఖాన్ , సౌమీ పాండే , రుద్ర పటేల్ , ఆరాధ్య శుక్లా , నమన్ తివారీ

- Advertisement -

ఐర్లాండ్ జ‌ట్టు
ఫిలిప్పస్ లే రౌక్స్ (సి) , మక్దారా కాస్గ్రేవ్ ,హ్యారీ డయ్యర్ , డేనియల్ ఫోర్కిన్, కియాన్ హిల్టన్, ర్యాన్ హంటర్, ఫిన్ లుటన్, స్కాట్ మక్‌బెత్, కార్సన్ మెక్కల్లౌ, జాన్ మెక్నాలీ, జోర్డాన్ నీల్, ఆలివర్ రిలే, గావిన్ రౌల్స్టన్, మాథ్యూ వెల్డన్, రూబెన్ విల్సన్.

పాయింట్స్ టేబుల్

ఇక ప్రస్తుతం గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరుగుతుండగా… ఏ గ్రూప్‌లోని భారత జట్టు ఒక విజయంతో టేబుల్ టాపర్‌‌గా ఉంది. ఇక ఇక విజయం, ఒక ఓటమితో ఐర్లాండ్, బంగ్లాదేశ్ జట్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఒక ఓటమితో టేబుల్ లో ఆఖరి స్థానంలో ఉంది యూఎస్‌ఏ జట్లు.

గ్రూప్-ఏలో ఇండియా (2), ఇర్లాండ్ (2) , బంగ్లాదేశ్ (2) , యూఎస్‌ఏ (0)

గ్రూప్-బిలో ఇంగ్లాండ్ (4) , సౌతాఫ్రికా (2) , వెస్టిండీస్ (0), స్కాంట్లాండ్ (0)

గ్రూప్-సిలో ఆస్ట్రేలియా (2) , శ్రీలంక (2) , జింబాబ్వే (0), నమీబియా (0)

గ్రూప్-డిలో న్యూజిలాండ్ (4) , పాకిస్థాన్ (2), అప్ఘానిస్థాన్ (0), నేపాల్ (0)

గ్రూపు దశలో పాయింట్ల పట్టికలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన 12 జట్లు సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు ఆడిస్తారు. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 11న తుది పోరు జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement