అమరావతి, ఆంధ్రప్రభ : బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పర్యవేక్షణలో ఈ నెల 13 నుంచి 27వ తేదీ వరకు అండర్ -19 పురుషుల అంతర్జాతీయ క్వాడ్రాంగ్యులర్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొననున్న ఇంగ్లాండ్ జట్టు ఆదివారం విజయవాడకు చేరుకుంది.
గన్నవరం విమాశ్రయంలో వారికి టోర్నమెంట్ ఇంచార్జిలు బాపూజీ, వెంకటాద్రి రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. మూలపాడులోని డీవీఆర్, సీపీ గ్రౌండ్లలో నిర్వహిస్తున్న టోర్నమెంట్ లో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్లు, మన దేశం తరపున ఇండియా-ఎ, ఇండియా- బి జట్లు పాల్గోనున్నాయి.