హైదరాబాద్: అల్ట్రామారథాన్ రన్నర్ విజయ్ యర్గల్ శనివారం వరంగల్-హైదరాబాద్ మధ్య 150 కి.మీ నాన్‌స్టాప్ రన్‌ను ప్రారంభించనున్నారు. అరబిందో 150వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని సుదూర పరుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు హన్మకొండలోని అరబిందో సొసైటీ నుంచి ప్రారంభమై.. ఆదివారం ఉదయం 9 గంటలకు అల్ట్రా మారథాన్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు విజయ్. ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ సహకారంతో.. అల్ట్రా-రన్నర్ విజయ్ యర్గల్ రాత్రంతా పరిగెత్తాలని అది కూడా 12 నుండి 14 గంటల్లో 150 కి.మీ దూరాన్ని పూర్తి చేయడానికి టార్గేట్ పెట్లుకున్నాడు.
“ఇది అరబిందో 150వ జయంతి, ఈ రన్ ద్వారా నేను అతని బోధనల గురించి అవగాహన కల్పించాలనుకుంటున్నాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది శరీరంలోకి, స్పృహ, నియంత్రణ, క్రమశిక్షణ, మెరుగైన జీవితానికి అవసరమైన అన్ని విషయాలను తీసుకురావడమేనని అరబిందో స్వయంగా చెప్పారు. ”అని విజయ్ పేర్కొన్నాడు.
విజయ్ యార్గల్ అల్ట్రా మారథాన్‌లకు కొత్తేమీ కాదు. గత కొన్ని సంవత్సరాలలో అతను 78 కి.మీ నుండి 221 కి.మీ వరకు ఉన్న ప్రధాన జాతీయ, అంతర్జాతీయ అల్ట్రా-మారథాన్‌లను పూర్తి చేశాడు. 2019లో, విజయ్ 165 కి.మీ దూరంలో ఉన్న సుప్రసిద్ధ మారథాన్ అయిన అల్ట్రా-ట్రైల్ మౌంట్ ఫుజికి అర్హత సాధించాడు. అలాగే అతను ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్‌లోని అల్ట్రా-మారథాన్, అల్ట్రా టైల్ డు మోంట్ బ్లాంక్ (UTMB)ని కూడా పూర్తి చేశాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.