Friday, November 22, 2024

Uber, Thomas Cup: క్వార్ట‌ర్స్ లోనే ముగిసిన భార‌త క‌థ‌

ప్రతిష్టాత్మక థామస్‌, ఊబర్‌ కప్‌ ఫైనల్స్‌లోభారత్‌ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. థామస్‌ కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ క్వార్టర్స్‌లో 1-3 తేడాతో చైనా చేతిలో పోరాడి ఓడింది. 2022లో ఇండోనేషియాను ఓడించిన భారత్‌.. పటిష్టమైన చైనాతో పోరులో మాత్రం తడబడింది. మరోవైపు సీనియర్ల గైర్హాజరీలో ఊబర్‌ కప్‌ ఆడిన అమ్మాయిలు.. 0-3 తేడాతో జపాన్‌ చేతిలో ఓడారు. థామస్‌ కప్‌ క్వార్టర్స్‌ పోరులో భాగంగా హెచ్‌ఎస్‌ ప్రణయ్‌.. 21-15, 11-21, 14-21 తేడాతో షి యు కి చేతిలో ఓడిపోవడంతో చైనాకు ఆరంభంలోనే ఆధిక్యం దక్కింది.

- Advertisement -

ఆ తర్వత డబుల్స్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌.. 15-21, 21-11, 12-21తో లియాంగ్‌ వె కెంగ్‌-వాంగ్‌ చెంగ్‌ల చేతిలో చిత్తయ్యారు. కానీ లక్ష్యసేన్‌ మాత్రం 13-21, 21-8, 21-14తో లి షి ఫెంగ్‌ను ఓడించి భారత శిబిరంలో ఆశలు రేపాడు. అయితే మరో డబుల్స్‌ ద్వయం ధ్రువ్‌-ప్రతీక్‌ 10-21, 10-21 తేడాతో హె జి థెంగ్‌ – రెన్‌ జియాంగ్‌ యు చేతిలో ఓడటంతో భారత పోరాటం ముగిసింది.

జ‌సాన్ చేతిలో ఓట‌మి..

అంతకుముందు ఊబర్‌ కప్‌లో భారత్‌కు జపాన్‌ చెక్‌ పెట్టింది. తొలి సింగిల్స్‌లో అష్మిత.. 10-21, 22-20, 15-21 తేడాతో అయ ఒహొరి చేతిలో పోరాడి ఓడింది. ప్రియ-శృతి ద్వయం 8-21, 9-21 పోరాటం లేకుండానే చేతులెత్తేశారు. ఇష్రాణి 15-21, 12-21 తేడాతో మాజీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ఒకుహర చేతిలో చిత్తైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement