Monday, July 1, 2024

ICC T20 | సూర్య ర్యాంక్ ఢ‌మాల్… టాప్ ర్యాంక్ ఎవ‌రికంటే !

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో చాలా కాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 844 రేటింగ్స్‌తో నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ప్ర‌స్తుతం సూర్యకుమార్ (842 రేటింగ్)తో రెండో స్థానానికి పడిపోయాడు. 2023 డిసెంబర్ తర్వాత మొదటిసారి స్టార్ ఇండియన్ బ్యాటర్ సూర్య‌కుమార్ యాద‌వ్ అగ్ర‌స్థానాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది.

ఐసీసీ తాజా పురుషుల టీ20 బ్యాటర్ల టాప్‌-5 ర్యాంకింగ్స్

  1. ట్రావిస్‌ హెడ్- 844 రేటింగ్స్
  2. సూర్యకుమార్‌ యాద‌వ్‌- 842 రేటింగ్స్
  3. ఫిల్ సాల్ట్- 816 రేటింగ్స్
  4. బాబర్ ఆజం- 755 రేటింగ్స్
  5. మహ్మద్ రిజ్వాన్- 746 రేటింగ్స్
Advertisement

తాజా వార్తలు

Advertisement