ఒలింపిక్స్ లో పాత రికార్డులు బద్దలు కొడుతూ కొత్త రికార్డులు తిరగరాయడం ఎప్పుడు జరిగేదే. కాని తన పేరిటే ఉన్న పాత రికార్డును తూడిచిపెడుతూ సరికొత్త రికార్డు నమోదు చేయడం అరుదుగా జరిగేదే..ఉస్సెన్ బోల్ట్, మైకెల్ ఫెల్ఫ్ లాంటి వారు ఇలాంటి ఘనత సాధించిన వారిలో ముందుంటారు. తాజాగా టోక్యో ఓలింపిక్స్ లో జార్జియాకు చెందిన వెయిట్ లిఫ్టర్ లాషా తలాఖద్జె అద్భుతమే చేశాడు. మెన్స్ +109 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో లాషా… తన ఆకారానికి తగ్గట్టే బరువులను ఇట్టే ఎత్తేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. ఆరు అడుగుల ఆరు అంగుళాల ఎత్తు… 176 కేజీల బరువుతో అజానుబాహుడైన లాషా… మొత్తం 488 కేజీలు (స్నాచ్‌లో 223+క్లీన్ అండ్ జెర్క్‌లో 265) బరువు ఎత్తి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు.
పసిడి పతకం సాధించడమే కాకుండా.. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌తో పాటు ఓవరాల్ బరువులో గతంలో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. రెండో స్థానంలో నిలిచిన అలీ డెవౌడి (ఇరాన్) కంటే లాషా 47 కేజీలు ఎక్కువగా ఎత్తడం విశేషం. ఒలింపిక్స్‌లో లాషాకు ఇది రెండో స్వర్ణం. 2016 రియోలో +105 కేజీల విభాగంలో బరిలోకి దిగిన అతడు బంగారు పతకంతో మెరిశాడు. అలీ డెవౌడి 441 కేజీల (స్నాచ్‌లో 200+క్లీన్ అండ్ జెర్క్‌లో 241)తో రజతాన్ని…. మన్ అసద్ (సిరియా) 424 కేజీల(స్నాచ్‌లో 190+క్జీన్ అండ్ జెర్క్‌లో 234)తో కాంస్యాన్ని దక్కించుకున్నారు.
ఇది కూడా చదవండి: ఇక పై 57 ఏండ్లకే వృద్ధాప్య పింఛన్..