Tuesday, November 26, 2024

టోక్యో ఒలింపిక్స్ కి కరోనా బెడద..

టోక్యో ఒలింపిక్స్ ని కరోనా వదిలేలా లేదు. ఒలింపిక్స్ కోసం అథ్లెట్ ఇప్పుడిప్పుడే టోక్యోకి చేరుకుంటున్నారు. గత నెలలో జపాన్ చేరుకున్న ఉగాండా జట్టులోని ఇద్దరు క్రీడాకారులు కూడా కరోనా బారినపడ్డారు. దీంతో విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే తాజాగా సెర్బియా ఒలింపిక్ బృందంలోని ఓ అథ్లెట్ కరోనా బారినపడ్డాడు. ప్రపంచ క్రీడా సంబరానికి మరో మూడు వారాలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఆటగాడికి పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సెర్బియా క్రీడా బృందం నిన్న టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో ల్యాండైంది. ఆ వెంటనే ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. ఈ బృందం నాంటో నగరంలో ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందాల్సి ఉంది. పాజిటివ్‌గా తేలిన అథ్లెట్‌ను ఐసోలేషన్‌కు పంపగా, మిగతా నలుగురిని ఎయిర్‌పోర్టు సమీపంలోని ప్రత్యేక కేంద్రానికి తరలించారు. కాగా, ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు విదేశీ ప్రేక్షకులకు అనుమతి లేదు. స్థానిక ప్రేక్షకులను మాత్రం 10 వేల మందికి మించకుండా అనుమతించనున్నారు.

ఇది కూడా చదవండి: ధోని సన్ ఆఫ్ సచిన్

Advertisement

తాజా వార్తలు

Advertisement