Saturday, November 23, 2024

సెమీస్‌లో తైజు చేతిలో ఓడిన పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లో ఓడింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శనివారం ప్రపంచ నంబర్‌-1 చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌తో సెమీస్‌లో తలపడిన పీవీ సింధు 18-21, 11-21 తేడాతో వరుస సెట్లలో పరాజయాన్ని చవిచూసింది.  మొదట్లఓ దూకుడు ప్రదర్శించినా.. తర్వాత వెనకబడింది. సింధుకు స్మాష్ షాట్స్ మైనస్ గా మారింది. పీవీ సింధు, తై జు యింగ్ ఇప్పటి వరకూ 19 సార్లు తలపడగా.. ఇందులో ఏకంగా 14 సార్లు పీవీ సింధుని తైజు ఓడించడం గమనార్హం. రేపు కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్ లో సింధు ఆడనుంది.

నిన్న మహిళల సింగిల్స్‌ విభాగంలోని క్వార్టర్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై సింధు విజయం సాధించింది. తొలి గేమ్‌లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన ఆమె రెండో గేమ్‌లోనూ సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన రెండో గేమ్‌లో 22-20తో సింధు నెగ్గింది. కాగా, 2016 రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరిన పీవీ సింధు రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement