టోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు ఇవాళ నిరాశే ఎదురైంది. నేడు మూడు ఈవెంట్లలో భారత అథ్లెట్లు పోటీపడగా, మూడింటిలోనూ నిరాశే ఎదురైంది. షార్ట్ పుట్ ఈవెంట్‌లో పోటీపడిన భారత అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ థోర్, 12వ స్థానంలో నిలిచాడు. మెడల్ సాధిస్తాడన్న అంచనాలతో బరిలోకి దిగిన జిందర్‌పాల్ సింగ్ తూర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. షాట్‌పుట్ ఎ గ్రూప్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేసిన అతడు.. తొలి ప్రయత్నంలో 19.99 మీటర్ల దూరం విసిరాడు. అయితే ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు. దీంతో 13వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు వెళ్లకుండానే ఇంటిదారి పట్టాడు. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్‌కు చెందిన టోమస్ వాల్ష్ 21.49 మీటర్ల దూరంతో టాప్‌లో నిలిచాడు.
కాగా ఇవాళ ఉదయమే ఇండియన్ పురుషుల హాకీ టీమ్ సెమిఫైనల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు భారత వుమెన్ రెజ్లర్ సోనమ్ మాలిక్ తొలి రౌండ్‌లోనే ఓడింది. 62 కేజీల విభాగంలో మంగోలియా రెజ్లర్ బోలోతుయా కురెల్‌కుతో జరిగిన మ్యాచ్‌లో 2-2 తేడాతో ఓడింది సోనమ్ మాలిక్. మహిళల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత అథ్లెట్ అన్నూ రాణి నిరాశపరిచింది. ఫైనల్‌కి అర్హత సాధించాలంటే 60 మీటర్ల దూరం విసరాల్సిన దశలో అన్నూ రాణి అత్యుత్తమంగా 54.04 మీటర్లు మాత్రమే విసిరి 14వ స్థానంలో నిలిచింది.
ఇది కూడా చదవండి: అవు లేగదూడకి ఘనంగా బారసాల