ఒలింపిక్ క్రీడలపై మరోసారి అనుమాన మేఘాలు అలముకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కష్టమేనని జపాన్ ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కరోనా సంక్షోభం మరింతగా ముదిరితే టోక్యో ఒలింపిక్స్ ను రద్దు చేస్తామని అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి తోషిహిరో నికాయ్ తెలిపారు. వాస్తవానికి టోక్యో ఆతిథ్యమివ్వాల్సిన ఒలింపిక్ క్రీడలు 2020 జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుండడంతో ఒలింపిక్స్ ను 2021కి రీషెడ్యూల్ చేశారు. ఈ ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించాలని భావించినా, అప్పటికి కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయన్నదానిపై అనిశ్చితి నెలకొంది. ఒలింపిక్స్ ను జరపలేని పరిస్థితులు ఏర్పడితే, రద్దు చేయడమొక్కటే మార్గమని వెల్లడించారు. ఒలింపిక్స్ నిర్వహణతో కరోనా మరింత వ్యాపిస్తుందని అనుకుంటే, ఒలింపిక్స్ జరపడం ఎందుకు? అని ప్రశ్నించారు.
టోక్యో ఒలింపిక్స్ మరోసారి వాయిదా..?
- Tags
- breaking news telugu
- corona bulitin
- corona bulletin
- corona cases
- corona effect
- COVAXIN
- first dose
- icmr
- immunity
- india corona cases
- latest breaking news
- latest news telugu
- lockdown second wave
- sanitizier
- second dose
- second vaccination
- second wave
- telugu epapers
- telugu latest news
- telugu trending news
- TOKYO OLYMPICS
- vaccination
- VACCINE
- viral news telugu
- wear mask
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement