నేడు ఐపీఎల్ 2024 17వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఐపీఎల్ 2024 ప్రస్తుత సెషన్‌లో ఇరు జట్లకు ఇది నాల్గవ మ్యాచ్. మ్యాచ్ నేడు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్ లలో 4 పాయింట్లతో -0.738 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్ లలో రెండు పాయింట్లతో -0.337 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.
గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటి వరకు మొత్తం 3 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాయి. ఇందులో పంజాబ్ పై రెండు మ్యాచ్ లు గుజరాత్ గెలవగా, పంజాబ్ 1 మ్యాచ్ ను కైవసం చేసుకోవడంతో పంజాబ్‌పై గుజరాత్ పైచేయి సాధించింది. ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ అత్యధిక స్కోరు 190 కాగా, గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ అత్యధిక స్కోరు 189. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. గుజరాత్ టైటాన్స్ మార్చి 24న తమ మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 6 పరుగుల తేడాతో గెలిచింది. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 63 పరుగుల తేడాతో ఓడిపోయింది, ఆపై మూడో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక పంజాబ్.. మార్చి 23న ఢిల్లీ క్యాపిటల్స్ ని 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక రెండో మ్యాచ్ లో మార్చి 25న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.
గుజరాత్ టైటాన్స్ జట్టు – డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, సందీప్ వారియర్, నూర్ అహ్మద్, ఆర్ సాయి ఖాన్‌షోర్, ., జోష్ లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుఖ్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, రాబిన్ మింజ్
పంజాబ్ కింగ్స్ జట్టు – శిఖర్ ధావన్, జితేష్ శర్మ, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ భాటియా, అథర్వ తైడే, రిషి ధావన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, శివమ్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కాగితన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, గుర్నూర్ బ్రార్, విద్వాత్ కావరప్ప, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్లు