Friday, November 22, 2024

IPL : నేడు ల‌క్నోతో చెన్నై ఢీ

ఐపీఎల్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫైట్ నేడు జరుగనుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌.. ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. లక్నో హోం గ్రౌండ్‌ అయిన భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇంచుమించు ఒకటే తరహా ప్రదర్శనలతో ముందుకు పోతున్నాయి.

లక్నోతో పోలిస్తే సీఎస్‌కే ఓ అడుగు ముందుంది. సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించగా.. లక్నో ఆరింట మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ప్రస్తుతం సీఎస్‌కే మూడు, లక్నో ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -

హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ జరుగగా చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. బలాబలాల విషయానికొస్తే.. లక్నోతో పోలిస్తే చెన్నై అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. సీఎస్‌కేలో అందరు ఆటగాళ్లు తలో చేయి వేస్తూ జట్టు విజయాలకు దోహదపడుతున్నారు. లక్నో విషయంలో టీమ్‌ వర్క్‌ కొరవడింది. పేపర్‌పై ఆ జట్టు బలంగా కనిపిస్తున్నప్పటికీ రియాల్టిలో మాత్రం తేలిపోతుంది. యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ లేని లోటు లక్నోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాలి.

తుది జట్లు (అంచనా)..
లక్నో: క్వింటన్ డికాక్, కేఎల రాహుల్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్

సీఎస్‌కే: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), అజింక్య రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్‌ ధోని (వికెట్‌కీపర్‌), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్

Advertisement

తాజా వార్తలు

Advertisement