Thursday, November 21, 2024

Breaking: ఇవ్వాల కూడా ఫ‌స్ట్ బ్యాటింగ్ ఇండియాదే.. ఆల్ ద బెస్ట్ అంటున్న క్రికెట్ అభిమానులు

భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య ఇవ్వాల ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌బోతోంది. ఇప్ప‌టికీ జ‌రిగిన నాలుగు మ్యాచ్‌ల‌లో సౌతాఫ్రికా రెండు, ఇండియా రెండు మ్యాచ్‌ల‌ను గెలుచుకున్నాయి. ఇక ఇవ్వాల్టి మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కం కానుంది. ఈ మ్యాచ్ ఏ జ‌ట్టు గెలిస్తే వారికే సిరీస్ కైవ‌సం అవుతుంది. ఇక‌.. ఇవ్వాల మ్యాచ్‌కు సంబంధించి సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

కాగా, బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియంలో ఇవ్వాల ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గనుంది. దీనికి సంబంధించి కొన్ని వివ‌రాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.. చిన్న‌స్వామి స్టేడియం గ్రౌండ్ హిస్ట‌రీని ప‌రిశీలిస్తే.. టీ20 మ్యాచ్‌ల‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్టుగా ఇండియా ఉంది. అది కూడా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 202 ప‌రుగులు సాధించి ఈ స్టేడియంలో రికార్డు నెల‌కొల్పింది. అంతేకాకుండా అత్య‌ధికంగా 194 ప‌రుగుల ఛేద‌న‌లో ఇండియాపై ఆస్ట్రేలియా సాధించింది. ఇక‌.. లోయేస్ట్ రికార్డుల‌ను చూస్తే.. 127/ 10 వికెట్ల‌తో ఇండియా మీద ఇంగ్ల‌డ్ గెలిచింది. 146/7 వికెట్ల‌తో బంగ్లాదేశ్‌పై ఇండియా గెలిచింది..

ఇక‌.. గ్రౌండ్ స్టేట‌స్‌ని క‌నుక ప‌రిశీలిస్తే.. (ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్‌లు) టోట‌ల్‌గా ఎనిమిది మ్యాచ్‌లు జ‌రిగాయి. వీటిలో ఫ‌స్ట్ బౌలింగ్ చేసిన జ‌ట్లు మూడు సార్లు గెలిచాయి. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన జ‌ట్లు 5 సార్లు గెలిచాయి. అంటే ఈ స్టేడియం ఫ‌స్ట్ బ్యాటింగ్ తీసుకున్న జ‌ట్ల‌కు అనుకూలంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. అంతేకాకుండా.. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన జ‌ట్టు యావ‌రేజ్‌గా 153 ప‌రుగులు చేయ‌గా.. సెకండ్ ఇన్సింగ్స్ తీసుకున్న జ‌ట్టు యావ‌రేజ్‌గా 144 ప‌రుగులు చేసిన‌ట్టు రికార్డులున్నాయి. ఏదేమైనా ఇవ్వాల ఇండియా గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని భార‌త క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement