Monday, November 18, 2024

Spl Story | కొడుకు చివరి కోరిక తీర్చిన పేరెంట్స్​​.. ఈ దయనీయమైన స్థితి ఎవరికీ రావొద్దు!

తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ వేడుక చాలా చాలా స్పెషల్​, ి అనే చెప్పుకోవాలి. ఒకవైపు ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది.. చేతికి అందవచ్చిన కొడుకు మృతుని తట్టుకోలేక బోరున విలపిస్తూనే.. మరోవైపు ఆ బాలుడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపింది. అతని చివరి కోరిక నేరవేర్చేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు కేక్​ కట్​చేసి హ్యాపీ బర్త్​డే విషెష్​ కూడా చెప్పారు. ఇలాంటి పరిస్థితి మరే తల్లదండ్రులకు రాకూడదని వారు కన్నీటితో ఆ దేవుడిని ప్రార్థించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఆసిఫాబాద్​ జిల్లాలోని బాబాపూర్ గ్రామంలో 16 ఏళ్ల బాలుడు తన బర్త్​డేకు ఒక రోజు ముందు అనుమానాస్పదంగా.. గుండెపోటుతో చనిపోయాడు. అయితే.. అతని కోరికను నెరవేర్చడానికి శోకసంద్రంలో ఉన్న తల్లిదండ్రులు మృతదేహాన్ని పక్కనే ఉంచి కేక్ కట్ చేశారు. మే 19వ తేదీన బాలుడి పుట్టినరోజు కాగా, కడుపునొప్పితో బాధపడుతూ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం అతను చనిపోయాడు.

ఇక.. ఆ బాలుడి తల్లిదండ్రులు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి 12 గంటలు కొట్టగానే వారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలుడి తల్లిదండ్రులు గుణవంతరావు, లలిత వారి బంధువులు కలిసి కేక్‌ ఏర్పాటు చేసి బాలుడి మృతదేహం పక్కనే కేక్‌ కట్‌ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. ఇక.. కేక్‌ కట్‌ చేస్తున్న సమయంలో చనిపోయిన బాలుడి చేయి పట్టుకున్నారు. బాలుడి మృతదేహం మంచం మీద పడుకున్నట్టు ఉన్నప్పటికీ, వారు చప్పట్లు కొడుతూ, పుట్టినరోజు శుభాకాంక్షలు పాటలు పాడారు.

- Advertisement -

ఆ తర్వాత (శుక్రవారం) బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు. ఇంట్లో తమ అబ్బాయికి కడుపునొప్పి రావడంతో మంచిర్యాల ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబీకులు తెలిపారు. చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడని. గుండెపోటుతో చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. అయితే.. మరణానికి కచ్చితమైన కారణాన్ని ఇంకా నిర్ధారించలేదు. పోస్ట్ మార్టం నివేదిక కోసం వెయిట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement