కాన్పూర్: కివీస్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ భారత స్పిన్ లెజండ్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. తొలిటెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 5వికెట్లు తీసిన సౌథీ రెండో ఇన్నింగ్స్ లోనూ 3వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో సౌథీ టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించాడు. 10టెస్టుల్లో సౌథీ 51వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈక్రమంలో కివీస్ తరఫున భారత్ పై ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఈ జాబితాలో కివీస్ పేస్ దిగ్గజం రిచర్డ్ హాడ్లీ 14టెస్టుల్లో 65వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. కాగా కివీస్‌పై కుంబ్లే 50వికెట్లను పడగొట్టగా.. సౌథీ 51వికెట్లతో జంబో రికార్డును బ్రేక్ చేశాడు. కివీస్ పై ఆడి ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్లలో బిషన్ సింగ్ బేడీ 57వికెట్లతో ప్రథమస్థానంలో ఉండగా 55వికెట్లతో ప్రసన్న, అశ్విన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అయితే అశ్విన్ తప్ప మిగిలిన మిగిలిన ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి విదితమే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital