గత సీజన్లలో చాంపియన్స్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ టీమ్ ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో మాత్రం చతికిలపడింది. కనీస పోరాట పటిమ కూడా చూపకుండా పించ్ హిట్టర్లు అనుకున్న ప్లేయర్లు మాడుపు ముఖాలేసుకుని నీరసంగా పెవిలియన్ చేరారు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు. రోహిత్ శర్మ (1), ఇషాన్ కిషన్ (10), కెమెరూన్ గ్రీన్ (5), సూర్యకుమార్ యాదవ్ (15), టిమ్ డేవిడ్ (4), నేహాల్ (21), హృతిక్ (5) పరుగులు మాత్రమే చేశారు.
ఇక.. ముంబయి జట్టులో కాస్త గట్టిగా పోరాటం చూపుతూ.. సిక్సులు, ఫోర్లతో ఆకట్టుకున్న ప్లేయర్‌గా తిలక్ వర్మ ఉన్నాడు. కఠినమైన బంతులను కూడా సునాయసంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుని పరుగులు పెట్టించాడు. సిక్స్ బాదిన సమయంలో హల్క్ వర్మగా స్కోరు బోర్డుపై నేమ్ రావడంతో అభిమానులు సంతోషంగా హాహాకారాలు చేశారు.
కాగా, తిలక్ వర్మ 84, అర్షద్ ఖాన్ 15 పరుగులతో రాణించి నాటౌట్‌గా నిలిచారు. దీంతో ముంబయి ఇండియన్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగలిగింది. దీంతో బెంగళూరు టార్గెట్ 172 పరుగులుగా ఉంది.