ఆంధ్రప్రభ, స్పోర్ట్స్ డెస్క్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ వేదికగా బుధవారం రాత్రి జరిగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ జట్టు కెప్టెన్ మార్క్రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, తొలి ఒవర్లో రెండో బంతికే సంజూ శాంసన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.. ఇక.. క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ సిక్సులు, ఫోర్లతో చెలరేగి పోయాడు.
56 బంతుల్లో 107 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక. తిలక్‌కు తోడు ఓపెనర్‌గా దిగిన అభిషేక్ శర్మ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకుని రాంగ్ బాల్ కోసం ముందుకొచ్చి స్టంప్ అవుటయ్యాడు. ఆ తర్వాత సూర్య, పాండ్యా, రింకూ తక్కువ స్కోరుకే అవుటయ్యారు. కాగా, చివర్లో వచ్చిన రమణ్‌దీప్ సింగ్ 6 బంతుల్లో 15 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇట్లా నీర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 219 పరుగులుచేసింది.. ఆరు వికెట్లను కోల్పోయింది.. కాగా, ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు ముందు 220 పరుగుల టార్గెట్ ఉంది..